Police are on alert during Dussehra festival: దసరా సందడి వేళ పట్టణాల నుంచి జనం సొంతూళ్లకు వెళ్లటాన్ని అవకాశంగా తీసుకుని దోపిడి దొంగలు రెచ్చిపోయే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంతనాలు జరిగే అవకాశమున్నందున హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు.. ఊళ్లకు వెళ్లే ముందు ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఊరెళ్లాల్సివస్తే బంగారు, వెండి నగలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవటం.. లేదంటే రహస్య స్థలంలో దాచుకోవాలని చెబుతున్నారు.
ఊరు వేళ్లెవారు ముందుగా పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి: సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటుచేసుకోవాలని.. సెంట్రల్ లాక్‌సిస్టమ్ ఉండాలని సూచిస్తున్నారు. పండుగ కోసం ఊరికెళ్లే ముందు దగ్గరలోని పోలీసుస్టేషన్‌లో సమాచారమివ్వాలని తెలిపారు. నమ్మకమైన వాచ్‌మెన్‌లనే సెక్యూరిటీకి నియమించుకోవాలని.. సీసీకెమెరాలతో ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుండాలని పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రధాన ద్వారానికి తాళం వేసినా.. కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచాలని.. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసిఉంచాలని సూచిస్తున్నారు.
కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవటం ఉత్తమమని చెబుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నంబర్ 94906 17444కు సమాచారమివ్వాలని పోలీసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: