ETV Bharat / crime

సీఐ నాగేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్.. - సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు

CI Nageshwar Rao Case Update: సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్టు స్పష్టం చేసిన సీపీ.. నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్​ దాఖలు చేసినట్టు తెలిపారు.

Petition in High court to take CI Nageshwar Rao into custody

author img

By

Published : Jul 14, 2022, 5:17 PM IST

CI Nageshwar Rao Case Update: హైదరాబాద్​ వనస్థలీపురంలో సీఐ నాగేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌ భగవత్ వెల్లడించారు. నాగేశ్వర్​రావు మీద వచ్చిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో సాంకేతికంగా ఆధారాలు సేకరించినట్లు సీపీ స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

"సీఐ నాగేశ్వర్​రావు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 164 స్టేట్​మెంట్​ రికార్టు చేయాల్సి ఉంది. పోలీస్​ కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. అందుకోసం పిటిషన్​ దాఖలు చేశాం. ఇప్పటికే.. సీసీటీవీ ఫుటేజీని తీసుకున్నాం. బాధితురాలితో సాంకేతిక ఆధారాలు సేకరించాం. ఆరోగ్య పరీక్షలు అయ్యాయి. ఇంకా కొందరు సాక్ష్యులు ముందుకు వస్తున్నారు. వాళ్ల స్టేట్​మెంట్స్​ కూడా తీసుకుంటున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్​ ఫైల్​ చేస్తాం. ఇంకా ఏవరైనా బాధితులుంటే.. ధైర్యంగా ముందుకు రావాలి. భయపడాల్సిన అవసరం లేదు." - మహేశ్​భగవత్​, రాచకొండ సీపీ

సీఐ నాగేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.