ETV Bharat / crime

కోనేరులో మునిగి యువకుడు మృతి - వికారాబాద్ వార్తలు

అప్పటివరకు ఎంతో సంతోషంగా హోలీ ఆడుకున్నాడు. అనంతరం స్నానానికి కోనేరుకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల అందులోనే మునిగి ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.

vikarabad, holi news
హోలీ వార్తలు, వికారాబాద్ వార్తలు
author img

By

Published : Mar 30, 2021, 3:28 PM IST

హోలీ వేడుకల అనంతరం కోనేరులో స్నానానికి దిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మహేశ్​(22) సోమవారం హోలీ ఆడిన తరువాత.. స్నానం చేయడానికి బుగ్గ రామేశ్వరాలయానికి వెళ్లాడు. అక్కడ కోనేరులో స్నానం చేయడానికి దిగిన మహేశ్..​ ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి చనిపోయాడు.

మహేశ్ ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు రాత్రి నుంచి వెతికారు. ఈ రోజు ఉదయం కోనేరు వద్ద మహేశ్ బట్టలని కుటుంబీకులు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి.. వికారాబాద్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: క్షుద్రపూజల ఉదంతంలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.