ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పాపాయిపల్లికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి బేస్తవారిపేటకు చెందిన ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై రూ.2,500 అప్పు ఇవ్వలేదంటూ దాడికి పాల్పడ్డాడు. అందరి ముందు మస్తాన్ తనను కొట్టాడని ఇజ్రాయిల్ అవమానంగా భావించాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగానని ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఇజ్రాయిల్‌ను చికిత్స కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇజ్రాయిల్ మృతి చెందాడు. ఇజ్రాయిల్ ఇళ్లకు పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వృత్తిరీత్యా మస్తాన్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇజ్రాయిల్ పనిచేసే గృహ యజమానులకు పెయింట్ సంబంధిత మెటీరియల్ తరలించే క్రమంలో మస్తాన్‌కు ఆటో కిరాయి కింద రూ.2500 వరకు బాకీ పడ్డాడు.
ఈ క్రమంలో బేస్తవారిపేట పట్టణంలో మస్తాన్‌కు ఇజ్రాయిల్ తారసపడ్డాడు. తన అప్పు చెల్లించవలసిందిగా పట్టు పట్టడంతో ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రెండు, మూడు రోజుల్లో ఇస్తానని ఇజ్రాయిల్.. మస్తాన్‌కు తెలిపాడు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని మస్తాన్ ఇజ్రాయిల్‌ను కొట్టడమే కాకుండా అతని వద్ద నుంచి ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరగడంతో ఇజ్రాయిల్ అవమానంగా భావించాడు. దీంతో పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ చోరీ.. తెలిసిన వాళ్లే చేశారా..?
బాలికపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు...