అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు నుంచి ఓ లారీలో కొడంగల్-తాండూరు మీదుగా కర్నాటకకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. తాండూరు పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో తనిఖీ చేయగా... డ్రైవర్ సమాధానాలతో అనుమానం వచ్చిందని వివరించారు.
లారీని పోలీస్ స్టేషన్కి తరలించగా... పోలీసుల విచారణలో కర్నాటకకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు డ్రైవర్ మహ్మద్ జాఫర్ చెప్పాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి... రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి