ETV Bharat / crime

కనిపించకుండా పోయి హిజ్రాగా మారాడు.. ఆ తర్వాత..?

author img

By

Published : Jun 30, 2021, 6:40 PM IST

అతనికి కోట్ల ఆస్తి ఉంది.. బాగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు.. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువకుడు రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. చివరికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అతడు ఉన్నాడని తెలిసింది. వెంటనే అక్కడి చేరుకున్న తల్లిదండ్రులు ఆ యువకుడిని చూసి షాకయ్యారు.

transgender
హిజ్రా, వేములవాడ
కనిపించకుండా పోయి హిజ్రగా మారాడు.. ఆ తర్వాత..?

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తల్లిదండ్రులు కొడుకుని చితకబాది ఇంటికి తీసుకెళ్లారు. పెద్దపల్లి జిల్లా ముంజపల్లి గ్రామానికి చెందిన వంగ మహేశ్​ అనే యువకుడు గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతలో వారి కుమారుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు వేములవాడలో మహేశ్​ కోసం వెతికారు. ఓ చోట అతన్ని చూసి షాకయ్యారు. తమ ముందు పాయింట్​, షర్ట్​ వేసుకుని అందరితో కలిసిమేలసి ఉండే అతను వారికి హిజ్రాగా కనిపించాడు. మహేశ్​ను తమ వెంట రావాలని తల్లిదండ్రులు, బంధువులు కోరారు. దానికి అతడు నిరాకరించటంతో ఆగ్రహించిన వారు మహేశ్​ను చితకబాది ఇంటికి తీసుకెళ్లారు.

తమ కుమారుడిని హిజ్రాలు ఇలాగా మార్చారని తల్లిదంద్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 20 ఎకరాల భూమి ఉందని చెప్పారు. కోట్ల ఆస్తికి మహేశ్​ వారసుడని కన్నీరుమున్నీరయ్యారు. అక్కడే ఉన్న హిజ్రాతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: Murder case: సెల్​ఫోన్​ దొంగిలించాడని స్నేహితుడినే చంపేశాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.