తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా(cannabis smuggling) విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఈ దందా ఆగట్లేదు. ఎక్కడికక్కడే రవాణాలు అడ్డుకుంటున్నా ఏదో మూల గంజాయి రవాణా(ganja transport) జరుగుతూనే ఉంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.
సంగారెడ్డిలో 6 క్వింటాళ్ల గంజాయిని (cannabis seized) టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఏపీలోని విశాఖపట్నం నుంచి వస్తున్న లారీలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తుక్కు కింద గంజాయి మూటలు పెట్టి లారీలో అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
నర్సీపట్నం దగ్గర గంజాయిని తక్కువ ధరలో తీసుకుని దానిని లారీలో లోడ్ చేశారు. అనంతరం అక్కడ స్క్రాప్‌ను తీసుకున్నారు. గంజాయి లోడ్‌పై స్క్రాప్ వేసేశారు. తుక్కుకు సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. దారిలో చెక్‌పోస్టుల వద్ద సమస్య వస్తే.. ఆ బిల్లులను చూపించాలనుకున్నారు. మనకు వచ్చిన సమాచారం మేరకు మనం లారీని ఇక్కడ అదుపులోకి తీసుకున్నాం. లారీలో 6 క్వింటాళ్ల గంజాయి ఉంది. దీని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది.
-పోలీసులు
ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: Ganja seized in Hyderabad today : హైదరాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Ganja smuggling via hyderabad: గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసుల పటిష్ఠ నిఘా.. పక్కా సమాచారంతో తనిఖీలు