ONLINE FRAUD: మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు .. ఇలా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆశపడి ఆకర్షితులైతే వారిని నిలువుదోపిడీ చేస్తారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. కారేపల్లి మండలం బీక్యాతండాకు చెందిన ప్రవీణ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కోసం ఆన్లైన్లో వెతికాడు. తన ఫేస్బుక్ ఖాతాలో ఉన్న ఓ ప్రకటన అతడిని ఆకర్షించింది. అందులో సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరలకే విక్రయిస్తామని అందులోని సారాంశం. దీంతో ఆయువకుడు అందులోని నెంబర్‌కి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి స్పందించి తాను ఆర్మీ అధికారినని ల్యాప్‌టాప్ విలువ రూ.13,500 అని మీకు రూ.12వేలకే ఇస్తామని ప్రవీణ్‌ని నమ్మించాడు. ముందుగా నగదు బదిలీ చేయాలని మరుసటి రోజు ల్యాప్‌టాప్‌ను ఇంటివద్దకే డెలీవరి చేస్తామని తెలిపాడు.
ఆవ్యక్తి ఆర్మీకి సంబంధించిన అతడి ఐడీకార్డు, ఆధార్ వివరాలు పంపడంతో ప్రవీణ్ నమ్మాడు. వారు చెప్పిన నెంబర్‌కి దశల వారిగా రూ.6 వేలు, మరోసారి రూ.3,900,రూ.2,100 పంపించాడు. ల్యాప్‌టాప్ కోసం పంపిన నగదు ఇంకా జమకాలేదని అవి హోల్డ్‌లో పడ్డాయని బాధితుడితో మాట్లాడిన వ్యక్తులు అతని నుంచి రూ.75,400 వరకు రాబట్టారు. అనంతరం వారు ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చదవండి: 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య... ఆ ప్రేమలేఖ విషయం బయటపడినందుకే..
Gujarat riots 2002: మోదీకి క్లీన్ చిట్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు