ETV Bharat / crime

Sexual Harassment: బాలుడిపై జవాన్​ లైంగికదాడి.. ఏడవడంతో గొంతు నులిమి హత్య - బాలుడి హత్య కేసు న్యూస్

Sexual Harassment: ఏపీ ప్రకాశం జిల్లా అక్కపల్లిలో దారుణ హత్య గురైన బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ మలికా గార్గ్ సంచలన విషయాలు వెల్లడించారు. బాలుడిని హత్య చేసింది ఓ ఆర్మీ జవాన్​ అని ఎస్పీ స్పష్టం చేశారు. "నిందితుడు ఆర్మీ జవాన్​గా పనిచేస్తున్నాడు. అతడికి ఇంటర్నెట్​లో లైంగిక వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈనెల 22న తన మెుబైల్​లో ఫోర్న్ వీడియోలు చూస్తూ తన లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బాలుడిని తనతో పాటు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు గట్టిగా ఏడవటంతో గొంతు నులిమి చంపేశాడు" అని ఎస్పీ వెల్లడించారు.

sexual
sexual
author img

By

Published : Jan 30, 2022, 10:48 PM IST

Sexual Harassment: ఏపీ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లిలో పదిరోజుల క్రితం హత్యకు గురైన బాలుడి కేసును పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమా శ్రీనాథ్ (11) తాటిచెర్ల మోటు జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈనెల 22న పాఠశాల నుంచి తిరిగి వచ్చి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు గిద్దలూరు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 25న ఇడకమల్లు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాలుడి పొట్ట భాగంలో ఓ రాయిని కట్టి బావిలో పడేశారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాం తప్పిపోయిన భూమా శ్రీనాథ్​దిగా గుర్తించారు.

కేసు విచారణను మరింత ముమ్మరం చేసిన పోలీసులు ఈనెల 29న హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఓ ఆర్మీ జవాన్​ అని ఎస్పీ వెల్లడించారు. సెలవుపై వచ్చిన నిందితుడు వెంకట ప్రశాంత్ కుమార్ గత కొంత కాలంగా స్వగ్రామం అక్కపల్లిలో ఉంటున్నట్లు తెలిపారు.

"నిందితుడు వెంకట ప్రశాంత్ కుమార్ ఆర్మీ జవాన్​గా పనిచేస్తున్నాడు. అతడికి ఇంటర్నెట్​లో లైంగిక వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈనెల 22న తన మెుబైల్​లో ఫోర్న్ వీడియోలు చూస్తూ తన లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. అదే రోజు సాయంత్రం చీకటి పడ్డాక రామాలయం వద్ద ఆడుకుంటున్న భూమా శ్రీనాథ్​ నిందితుడి కంట పడ్డాడు. పిల్లాడికి రూ.100 ఇచ్చి తన బైక్​పై ఎక్కించుకొని సుమారు ఎనిమిది గంటల సమయంలో ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్దనున్న ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బాలుడిపై లైంగిక దాడికి యత్నించాడు. బాలుడు గట్టిగా ఏడవటంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించి బాలుని ఒంటిపైనున్న చొక్క తీసేసి.., సుమారు ఆరు కేజీల రాయిని బాలుడి నడుముకి కట్టి బావిలో పడేశాడు." అని ఎస్పీ మలికా గార్గ్ వివరించారు.

సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా..

నేరం తనపైకి రాకుండా పోలీసుల దృష్టి మరల్చేందుకు నిందితుడు వెంకట ప్రశాంత్ కుమార్ పక్కా స్కెచ్ వేశాడు. హత్య చేసిన మరుసటి రోజు తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా నకిలీ ఫ్రూఫ్​లతో సిమ్ కార్డు తీసుకున్నాడు. బాలుడిని కిడ్నాప్ చేశానని... రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని బాలుడి పెదనాన్నకు ఫోన్​కు మేసెజ్ పెట్టాడు. మెసేజ్​​పై పోలీసులకు బాలుడి బంధువులు సమాచారం ఇవ్వటంతో వారు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: దారుణం.. బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.