సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం చౌటపల్లి రహదారిలో ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు.
గంట అయినా అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడాల్సిన స్థితిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. వెంటనే ప్రైవేట్ అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.