ETV Bharat / crime

లైవ్​ వీడియో: రోడ్డుపై పల్టీలు కొడుతూ ఆటో బీభత్సం - గాజులరామారంలో జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలు

మేడ్చల్​ జిల్లా జగద్గిరిగుట్టలోని గాజులరామారంలో ఓ ఆటో భీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుస్తూ వెళుతున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

one person injured in road accident at gajularamaram
గాజులరామారంలో నలుగురు యువకులను ఢీకొన్న ఆటో
author img

By

Published : Apr 17, 2021, 5:10 PM IST

అదుపుతప్పి యువకులపైకి దూసుకెళ్లిన ఆటో

అతివేగంతో వచ్చిన ఆటో నలుగురు యువకులపైకి దూసుకెళ్లగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధి గాజులరామారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

ప్రమాదం జరిగిందిలా..

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు యువకులపైకి ఆటో ఒక్కసారిగా దూసుకొచ్చింది. జగద్గిరిగుట్ట పరిధిలోని గాజులరామారంలో ఓ మలుపు వద్ద డ్రైవర్ మస్తాన్ అతి వేగంతో రాగా.. అదుపుతప్పిన ఆటో బోల్తా పడి నలుగురు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్​ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సాగర్​ ఉపఎన్నికలో ఓటు వేసిన ఎమ్మెల్సీ చిన్నప్పరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.