ETV Bharat / crime

SHAMIRPET ACCIEDENT: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలెరో.. ఒకరు దుర్మరణం - medchal district news

SHAMIRPET ACCIEDENT: మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

SHAMIRPET ACCIEDENT
SHAMIRPET ACCIEDENT
author img

By

Published : May 11, 2022, 5:05 AM IST

SHAMIRPET ACCIEDENT: ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. అదే సమయంలో అటుగా వస్తున్న బొలెరో ట్రాలీ వాహనం ఢీకొనడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూరహారి పల్లి చౌరస్తా వద్ద జరిగింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన రాగుల నాగులు(55) మజీద్ పూర్ వైపు నుంచి భారత్ బయోటెక్ వెళ్లే మలుపు వద్ద యూ టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బోలెరో ట్రాలీ ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగులుకు తీవ్ర గాయాలు కావడంతో ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు.

ఇవీ చూడండి: పుడ్డింగ్ పబ్ కేసులో ఒకరికి బెయిల్​.. మరొకరికి నిరాకరణ..!

'విదేశీ విరాళాల'పై సీబీఐ నజర్.. అదుపులో హోంశాఖ అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.