Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగి అప్పా జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు యజమాని నిర్లక్ష్యం కారణంగా.. ఆ వెనుకే బైక్‌పై వస్తున్న వ్యక్తి రక్తమోడుతూ మృతి చెందాడు. కారు రన్నింగ్‌లో ఉండగా.. ఉమ్మి వేసేందుకు యజమాని ఎల్లయ్య అకస్మాత్తుగా కారు డోర్ తీశాడు. ఇది గమనించని ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా కారు డోర్‌కు తగిలి గాల్లోకి ఎగిరి అవతలి వైపు రహదారిపై పడ్డాడు. అదే క్రమంలో అటుగా వస్తున్న లారీ.. అతనిపై నుంచి దూసుకెళ్లడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేస్త్రిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా రన్నింగ్ కారు డోరు తెరిచిన ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: ఆలయంలో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
'ఆప్' సర్కార్ మరో కీలక నిర్ణయం.. 424 మంది వీఐపీలకు భద్రత కట్!