జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడుకు చెందిన గణేష్(24)... ద్విచక్ర వాహనంపై కర్నూల్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న... శాంతినగర్‌కు చెందిన బాషా అనే వ్యక్తి బైక్‌ను బలంగా ఢీ కొట్టాడు.
ప్రమాదంలో గణేశ్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు... మానవపాడు ఎస్సై గురుస్వామి తెలిపారు. గాయపడిన భాషను కర్నూల్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: త్వరలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు