శంషాబాద్ విమానాశ్రయంలో డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ సరిచేస్తుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు. విమానాశ్రయంలోని డ్రైనేజీ పైపులైన్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల దాన్ని బాగు చేసేందుకు ముగ్గురు ప్లంబర్లు వచ్చారు. పైపులైన్‌ను సరిచేసేందుకు అందులో యాసిడ్ పోశారు.
ఒక్కసారిగా ఘాటైన వాసన రావడం వల్ల... రిపేరు చేస్తున్న నరసింహారెడ్డి (42)తో పాటు మరో ఇద్దరు సృహతప్పిపడిపోయారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... అందులో నరసింహారెడ్డి మృతిచెందాడు. నరసింహారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.