ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరిగింది.
జిల్లాలోని జహీరాబాద్ పట్టణం ఆనంద్ నగర్ కాలనీకి చెందిన బురకల రాజు(55) కిరాణం దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం పట్టణంలోకి వచ్చిన అతడు దుకాణంలోకి అవసరమైన సామాను తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎర్ర రాయి లోడుతో వస్తున్న లారీ వెనక నుంచి అతడు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏటీఎంలో సాయం పేరుతో మోసం... 2 లక్షలు కాజేసిన కేటుగాడు