ETV Bharat / crime

దారి విషయంలో గొడవ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

దారి విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. కొట్లాటకు, ఆపై కత్తి పోట్లకూ దారి తీసింది. ఈ దారుణ ఘటనలో ఓ నిండు ప్రాణం బలికాగా.. మరో ప్రాణం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

దారి విషయంలో గొడవ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
దారి విషయంలో గొడవ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
author img

By

Published : May 14, 2022, 11:46 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా ముదినేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ.. కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గాయపడగా.. చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ముదినేపల్లిలో దారి విషయమై తలెత్తిన వివాదంలో ఇర్ఫాన్ అనే వ్యక్తి.. నాగేంద్ర, మహేశ్​​పై కత్తితో దాడి చేసినట్లు బాధితుల బంధువులు పేర్కొన్నారు. ఇర్ఫాన్​కు సంబంధించిన 20 మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర, మహేశ్​​ను తొలుత గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇవాళ తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందారు. మరో వ్యక్తి మహేశ్​ పరిస్థితీ విషమంగానే ఉందని బంధువులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. మృతుడు నాగేంద్ర మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

ఇవీ చూడండి..

తల్లి, దత్తత కుమారుడి హత్య కేసులో మరో ట్విస్ట్​.. నిందితులు వాళ్లే.!

కాస్ట్​లీ కార్లలో తిరుగుతూ మహిళలకు టోకరా.. 100 మందిని నమ్మించి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.