లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్ నెంబర్ 103 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రనగర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.