Road Accident: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వస్తున్న పెళ్లి బృందం వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. 18 మందికి గాయాలయ్యాయి. గురువారం(మే 12న) మంగళగిరిలో వివాహం జరగ్గా.. అన్ని కార్యక్రమాలు ముగించుకుని రాత్రి సమయంలో వధూవరులతో సహా పలువురు బంధువులు తుపాన్ వాహనంలో హైదరాబాద్కు బయలుదేరారు.
ఈ క్రమంలో.. తెల్లవారుజామున కీసర పీఎస్ పరిధిలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి.. ఓఆర్ఆర్పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వధూవరులతో సహా వాహనంలోని 18 మందికి స్వల్ఫ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: