సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో వేములఘాట్లో విషాదం చోటుచేసుకుంది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లారెడ్డి(70) అనే వ్యక్తి... తన ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్నాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి తరలించారు. చుట్టుపక్కల వారిని వృద్ధుడి గురించి ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.