ETV Bharat / crime

కుమారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆత్మహత్య! - తెలంగాణ వార్తలు

ముగ్గురు కొడుకులను అల్లారు ముద్దుగా పెంచారు. చేతనైనంతలో ఆస్తిపాస్తులు సంపాదించారు. పిల్లలను పెంచి తమ బాధ్యత తీర్చుకున్నారు. కానీ రెక్కలు వచ్చిన ఆ పిల్లలు మాత్రం వృద్ధ తల్లిదండ్రులను మర్చిపోయారు. కుమారులు పట్టించుకోవడం లేదనే బాధతో చేసేదిలేక ఆ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు ఒడిగట్టారు.

old couple suicide, parents suicide due to sons
కుమారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆత్మహత్య, వృద్ధ దంపతులు ఆత్మహత్య
author img

By

Published : Apr 10, 2021, 11:52 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారులు పట్టించుకోవడంలేదనే బాధతో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన భూషణం, ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఆస్తిపాస్తుల్లోనూ ఎలాంటి లోటు లేనప్పటికీ ఎవరూ తమను పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురయ్యారు. ఈ తరుణంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్​కి ఉరేసుకుని ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.