ETV Bharat / crime

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్.. కారణం ఏంటంటే..?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో విచారణకు గైర్హాజరైనందుకు గానూ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్.. కారణం ఏంటంటే..?
ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్.. కారణం ఏంటంటే..?
author img

By

Published : Aug 6, 2021, 8:42 PM IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సంగారెడ్డిలో 2019లో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించారన్న కేసు విచారణకు జగ్గారెడ్డి హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఎన్​బీడబ్ల్యూ జారీ చేసింది.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉదయం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. హాజరుకాలేదు. దీంతో సాయంత్రం 4 గంటల 40 నిమిషాల వరకు వేచి చూసిన న్యాయస్థానం.. గైర్హాజరైన జగ్గారెడ్డి, మరో ముగ్గురిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 11న జగ్గారెడ్డిని హాజరు పరచాలని సంగారెడ్డి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు విచారణను 11కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.