ETV Bharat / crime

NILOFER: రికార్డుల్లో అంకెలు మార్చి.. రూ.1.20 కోట్లు స్వాహా చేసి..! - nilofar hospital diet contractor latest news

నిలోఫర్​ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆసుపత్రి క్యాంటీన్ రికార్డుల్లో అంకెలను మార్చి రూ.1.20 కోట్లు స్వాహా చేశాడంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

రికార్డుల్లో అంకెలు మార్చి.. రూ.1.20 కోట్లు స్వాహా చేసి..!

author img

By

Published : Jul 5, 2021, 10:24 PM IST

హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్ కోడూరి సురేశ్​బాబును సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు రికార్డులతో రూ.1.20 కోట్లు స్వాహా చేశారంటూ నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు.. కోడూరి సురేశ్​ బాబును అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

నిలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగులు, వైద్య చికిత్సలు చేస్తున్న డాక్టర్లకు నాణ్యమైన ఆహారం అందిస్తానంటూ సురేశ్​ బాబు నాలుగేళ్ల క్రితం టెండర్లలో పాల్గొని డైట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఇన్-పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారికి.. జూనియర్ వైద్యులు సహా వైద్యులందరికీ సురేశ్​బాబు.. పాలు, బ్రెడ్డు, అల్పాహారం, రెండు పూటలా భోజనం అందించాడు. నెలనెలా బిల్లులను చూపించి.. ఆసుపత్రి అధికార వర్గాలకు అందించి వాటిని పొందాడు. గత జులైలో సురేశ్​బాబు కాంట్రాక్టు పూర్తి కావడంతో ఆసుపత్రి అధికారులు టెండర్లను ఆహ్వానించారు.

రికార్డుల్లో అంకెలను మార్చి..

సురేశ్​పై అప్పటికే ఆరోపణలు వస్తున్నందున.. టెండర్​ను వేరే వ్యక్తికి అప్పగించారు. ఆసుపత్రి క్యాంటీన్ నుంచి సురేశ్​బాబు సమర్పించిన డైట్ బిల్లుల్లో గోల్‌మాల్ జరిగిందంటూ గతేడాది పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు.. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాటు క్యాంటీన్ రికార్డులను కమిటీ పరిశీలించింది. రికార్డుల్లో అంకెలను మార్చారని గుర్తించింది. ఇలా మూడేళ్లలో రూ.1.20 కోట్లు స్వాహా చేశారంటూ నివేదిక ఇచ్చింది.

రెండుసార్లు షోకాజ్​ నోటీసులు..

రికార్డులు ఎందుకు మార్చారు? అక్రమాలకు ఎందుకు పాల్పడ్డారంటూ ఆసుపత్రి అధికారులు సురేశ్​బాబుకు రెండుసార్లు షోకాజ్ నోటీసులు పంపారు. దీనికి సురేశ్​బాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ కమిటీ సభ్యులతో చర్చించారు. రికార్డులు మార్చినట్లు సాక్ష్యాధారాలను జతపర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: నిలోఫర్ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్​పై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.