ETV Bharat / crime

అమానవీయం.. రైల్వే టాయ్​లెట్​లో పసికందు - విశాఖలోని రైలులో గుర్తుతెలియని మహిళ ప్రసవం

Baby in train toilet: అమ్మ వెచ్చని స్పర్శలో హాయిగా నిద్రించాల్సిన ఆ పసికూన మరుగుదొడ్డిలో ఏడుస్తూ కనిపించాడు.. తల్లిపాలు తాగుతూ ఆకలి తీర్చుకోవాల్సిన ఆ శిశువు మురుగు వాసనలో ఆకలితో తల్లడిల్లుడుతున్నాడు.. మాతృప్రేమలో మునిగితేలాల్సిన ఆ పసిపాప.. ఆమె ఎలా ఉంటుందో తెలియక అల్లాడిపోయాడు. పుట్టిన నిమిషాల వ్యవధిలోనే రైలు టాయిలెట్​లో వదిలేసి తన దారిన తాను వెళ్లిపోయింది ఓ తల్లి. ఏ పాపం తెలియని ఆ శిశువును ఈ లోకంలోకి తెచ్చి అనాథను చేసింది. ఏపీలోని విశాఖలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

baby in train toilet
రైలు టాయ్​లెట్​లో పసికందు
author img

By

Published : May 11, 2022, 11:59 AM IST

Baby in train toilet: ఆంధ్రప్రదేశ్​లో ఓ వైపు అసని తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. రైలులో అప్పుడే ఓ తల్లికి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి వెచ్చని పొత్తిళ్లలో సేదతీరాల్సిన ఆ పసికందును.. పుట్టిన కాసేపటికే ఆ తల్లి రైలులోని మూత్రశాలలో వదిలేసి వెళ్లిపోయింది. విశాఖలోని రేల్వై స్టేషన్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలో ధన్‌బాద్- అలెప్పి ఎక్స్‌ప్రెస్‌ రైలులో నవజాత శిశువును వదిలేసిన ఘటన కలకలం రేపింది. బి-1 బోగి టాయిలెట్ వాష్‌ బేసిన్‌లో మగ శిశువును ఓ తల్లి విడిచి వెళ్లిపోయింది.

శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. మెరుగైన వైద్యం కోసం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పసికందును ఎవరు విడిచి వెళ్లారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: ఐపీఎస్‌ అధికారిణికి మెసేజ్‌లు.. అమెరికా నుంచి వచ్చి అరెస్ట్‌

మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!!

బలహీనపడిన 'అసని'.. ఈశాన్యం వైపునకు కదులుతున్న తుపాను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.