ETV Bharat / crime

సినీఫక్కీలో దర్జాగా విదేశాలకు వందకోట్ల డ్రగ్స్ తరలింపు.. ఎలాగో తెలుసా..

New technique in Smuggling Drugs: వీడొక్కడే సినిమాలో స్మగ్లర్​ లొసుగులను ఉపయోగించుకొని వినాయకుడి విగ్రహాల రూపంలో డ్రగ్స్​ వేరే దేశాలకు రవాణా చేస్తుండగా పట్టుబడతాడు. ఇదే మాదిరి ఇటీవల హైదరాబాద్​లో రామ్​రాజ్ బాక్స్​లో డ్రగ్స్​ రవాణా చేస్తుండగా నాచారం వద్ద పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్​పోర్ట్ స్కానింగ్​లో దొరకని ఈ డ్రగ్​ను ఇప్పటికే భారీగా విదేశాలకు సరఫరా చేశారని తెలిసి అవాక్కయ్యారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 21, 2022, 3:00 PM IST

Updated : Dec 21, 2022, 5:29 PM IST

New technique used by smuglers: హైదరాబాద్ విమానాశ్రయం మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​​కు వందల కోట్ల విలువైన సూడోఎఫిడ్రిన్ తరలిస్తూ పట్టుబడ్డ ముఠా కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియా పంపేందుకు సిద్ధం చేసిన రూ.9 కోట్ల విలువైన 8.5 కిలోల సూడోఎఫిడ్రిన్​ను ఇటీవల నాచారం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో తొలుత 15 సార్లు మాత్రమే పంపామని నిందితులు అంగీకరించారు. అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరింత లోతుగా విచారించగా అరెస్టయిన నిందితులు మలేషియా, సింగపూర్ సహా మరికొన్ని దేశాలకు భారీగా సూడోఎఫిడ్రిన్ రవాణా చేసినట్లు తేలింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​కు పంపించిన చిరునామాలు, నిందితులు ఫోన్ డేటా, రవాణాకు ఉపయోగించిన కొరియర్ సంస్థల నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు మరిన్ని దేశాలకు పంపినట్లు తేల్చారు. ఈ కేసులో పరారీలో ఉన్న చెన్నైకి చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ రహీమ్​కు, ఇతర దేశాల్లోనూ భారీ నెట్​వర్క్​ ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని వివరాలు రాబట్టేందుకు అరెస్టయిన రసూలుద్దీన్, మహ్మద్ కాశీంను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. పరారీలో ఉన్న ఫరీద్, పైసల్, రహీమ్ గాలించేందుకు చెన్నై, పుణెకు త్వరలో ప్రత్యేక బృందాలు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు.

డ్రగ్స్ రవాణాలో నిందితులు ఓ లూప్ హోల్ ను ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీల సందర్భంగా ప్యాకింగ్ వస్తువుల్ని స్కానింగ్ చేస్తారు. అన్ని రకాల డ్రగ్స్ అందులో గుర్తిస్తున్నా....సూడోఎఫిడ్రిన్​ స్కాన్ అవడం లేదు. అది పౌడర్ రూపంలో ఉండటమే ఇందుకు కారణం. కేసు దర్యాప్తులో భాగంగా నాచారం పోలీసులు, డీఆర్ఎస్ఐ అధికారులతో కలిసి తాజాగా మరోసారి శంషాబాద్ విమానాశ్రయంలో సూడో ఎఫిడ్రిన్​ను స్కానింగ్ చేసినా స్కానర్ లో కనిపించలేదు. నిందితులు ఇప్పటివరకూ దాదాపు రూ. వంద కోట్ల విలువైన సూడోఎఫిడ్రిన్​ను హైదరాబాద్, పుణె మీదుగా 15 సార్లు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.