జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చిన దంపతులను రోడ్డు ప్రమాదం కబళించింది. ఆదివారం రాత్రి ఓల్డ్ అల్వాల్‌లో రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని.. నేపాల్‌కు చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
అల్వాల్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ మార్ట్ వద్ద గత ఏడేళ్లుగా నేపాల్‌కు చెందిన నోమ్లాల్ బండారి, మీనాదేవి.. మరో ఇద్దరితో కలిసి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి 12 గంటల సమయంలో పనిపూర్తిచేసుకొని.. ఇంటికి వెళ్తుండగా ఓల్డ్ అల్వాల్ ఇందిరా గాంధీ విగ్రహం పక్కన శివాలయం వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వారిని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.
సమాచారం అందుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి: మరణంలోనూ వీడని భార్య భర్తల బంధం