ETV Bharat / crime

డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్ - Rangareddy district latest crime news

Dentist Kidnap Case
Dentist Kidnap Case
author img

By

Published : Dec 13, 2022, 8:50 PM IST

Updated : Dec 13, 2022, 9:18 PM IST

20:46 December 13

డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్

Naveen Reddy Arrest In Dentist Kidnap Case : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కాండోలిమ్ బీచ్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ నెల 9న వైశాలి ఇంటిపై నవీన్‌రెడ్డి, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి నవీన్‌ రెడ్డి పరారీలో ఉన్నాడు.

అసలేం జరిగిదంటే: వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం రావడంతో.. ఈనెల 9న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి, వైశాలిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు 'మిస్టర్-టీ' స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. ఉదయం పదకొంటున్నర గంటలకు మూడు కార్లు, ఓ డీసీఎమ్​లో మన్నెగూడలోని సిరిటౌన్ షిప్‌లో ఉండే వైశాలి ఇంటికి చేరుకున్నాడు.

పథకం ప్రకారం కిడ్నాప్: కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి, బాబాయ్ పైనా దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి సోఫా, టిపాయి, టీవీ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వైశాలిని ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. తన కారులో కూర్చోబెట్టాడు. నవీన్ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి వైశాలిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయారు.

నల్గొండ వైపు వెళ్లే మార్గంలో నవీన్ రెడ్డి, వైశాలిని కొట్టడంతో ఆమె నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. మిగతా నిందితులంతా మన్నెగూడ వైపు పారిపోయారు. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్.. ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని వెంటనే నవీన్ రెడ్డిని అప్రమత్తం చేశాడు. వైశాలిని ఇంటి వద్ద వదిలేద్దామని నిర్ణయించుకున్న నవీన్ రెడ్డి, అతని ఇద్దరు స్నేహితులు.. నల్గొండకు 20 కిలోమీటర్ల దూరంలో కారు దిగిపోయారు.

స్నేహితుడు సహాయంతో వైశాలిని క్షేమంగా ఇంటికి పంపిన నవీన్​రెడ్డి: రూమెన్ మాత్రం వైశాలిని కారులో ఎక్కించుకొని మన్నెగూడ వైపు పయనమయ్యాడు. 9వ తేదీ సాయంత్రం 6.30గంటల సమయంలో రూమెన్ ఫోన్ వైశాలికి ఇచ్చి తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆ తర్వాత వెంటనే ఫోన్ లాగేసుకొని స్విచాఫ్ చేశాడు. మన్నెగూడకు చేరుకున్న తర్వాత మరోసారి ఫోన్ ఆన్ చేసి వైశాలికి ఇచ్చి మన్నెగూడలోని ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నట్లు వైశాలితో చెప్పించాడు. వెంటనే రూమెన్ తన ఫోన్ తీసుకొని స్విచాఫ్ చేసి కారులో పారారయ్యాడు. కారును శంషాబాద్ మండలం తొండుపల్లిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కేసులో మొత్తం 36మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 32మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అందులో అయిదుగురిని కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇవీ చదవండి: పరిచయం.. ప్రేమ.. కిడ్నాప్​.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

ఐపీఎస్​పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళపై కాల్పులు.. హైకోర్టుకు వెళ్లే ముందే..

Last Updated : Dec 13, 2022, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.