Modi in PM Kisan samman Nidhi Meeting: సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమమే.. తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయమని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాల్సిందేనని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్(DRIDA)లో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల సమావేశంలో.. మోదీ వర్చువల్‌గా రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలతో పాటు కేంద్ర పథకాలపై అభిప్రాయాలు రైతులను మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని విడుదల చేసి.. రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, క్రిడా డైరెక్టర్ వీకే. సింగ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మీ పాత ఇంటిని పక్కకు జరపాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
"భారత స్టార్టప్‌లపై చర్చ జరుగుతోంది. ఉజ్వల యోజన పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. దేశాన్ని సురక్షితంగా ఉంచడామే ధ్యేయం. సర్జికల్ స్ట్రైక్ చేయడం పట్ల గర్వపడుతున్నాం. సేవా, సుపరిపాలన,పేదల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాల్సిందే. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది.. అవినీతి తగ్గిపోతుంది. సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పేదలకు అన్యాయం జరగవద్దు... పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. 2 వందల కోట్ల వ్యాక్సినేషన్‌ను ఉచితంగా ఇచ్చాం. యువత స్వయం సమృద్ధి కోసం ముద్రా రుణాలు అందించాం. ఓటు బ్యాంకు కోసం కాదు నయా భారత్ కోసమే.. ఈ సంస్కరణలు. ప్రజల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించింది. మెడికల్, టెక్నికల్ విద్యను మాతృభాషలో అందించేందుకు కృషి చేస్తున్నాం. పేదల ఆరోగ్యం కోసమే 5 లక్షలతో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశ పెట్టాం." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: నాలుగు నోట్‌బుక్స్‌లో రూ.40లక్షలు తెచ్చిన ఘనుడు.. ఎలా సాధ్యం?
కేసీఆర్ రానివ్వట్లేదు.." రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్ సమ్మాన్ యోజన కింద 10కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణకు కేసీఆర్ రానివ్వట్లేదని విమర్శించారు.
"చేపల, పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్ర భాగాన నిలిచింది. 20 లక్షల ఇల్లు కట్టించాం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టింటినా.. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రెండు లక్షల కోట్ల రూపాయలు నగదును అందజేశారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక.. పది కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం కట్టించింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా 5 లక్షల మేరకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. ఆయుషుమాన్ భారత్ కార్డులను సీఎం కేసీఆర్ తెలంగాణకు రానివ్వడం లేదు. కేసీఆర్ ప్రజలను కలవడు. సచివాలయం రాకుండా ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లోనే పడుకుంటాడు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక బాంబు పేలుళ్లు, మత కలహాలు లేవు." -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యటన శాఖ మంత్రి
ఇవీ చూడండి: