ETV Bharat / crime

నరబలి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఇంకా దొరకని నిందితులు - క్రైమ్ వార్తలు

Nalgonda Narabali Murder Case: ఈనెల 10న నల్గొండ జిల్లాలో కలకలం సృషించిన మొండెంలేని తల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా.. నిందితుల ఆచూకీ దొరకకపోవడంతో.. నల్గొండ పోలీసులు.. రాచకొండ పోలీసులు సహాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Nalgonda Narabali Murder Case
నరబలి హత్య కేసు
author img

By

Published : Jan 20, 2022, 9:59 AM IST

Nalgonda Narabali Murder Case: ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి, తల తెగ్గోసి తెచ్చి మహంకాళీ అమ్మవారి పాదాల ఎదుట పడేసిన హత్య నల్గొండ జిల్లాలో కలకలం సృషించింది. ఈ ఘటన జరిగి పది రోజులు అవుతున్నా.. నిందితులు ఎవరూ చిక్కలేదు. దీంతో నల్గొండ పోలీసులు.. రాచకొండ పోలీసులతో కలిసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ సమీపంలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో మొండెంను ఈ నెల 14న పోలీసులు గుర్తించారు. 12 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం , డాగ్ స్వ్కాడ్​తో తనిఖీలు చేసినప్పటికీ.. నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు. మృతుడు జైహింద్ నాయక్ ఒంటిపై దుస్తులు లేకుండా హత్య జరగటంతో.. నరబలి, గుప్తనిధులు, క్షుద్రపూజల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

జైహింద్ నాయక్ మొండెం దొరికిన ఇంటి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ నిర్మాణంలో ఉన్న ఇల్లు కేశ్యనాయక్​ది. కాగా.. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పద్మ మూడేళ్ల క్రితం భర్తపై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులకోసం ఆశపడి కేశ్యనాయక్​ను చంపి.. కటకటాల పాలైంది. ఈ మధ్య ఆ ఇంటిని కేశ్యనాయక్​ చిన్న భార్య శైలజ అమ్మకానికి పెట్టింది. దీంతో అతని భార్యల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేసి అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను, ఫోన్ సీడీఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల.. హత్యా...? నరబలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.