ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన పగిళ్ల వెంకన్న(38) మృతిచెందారు. ఎలా చనిపోయిందీ ఆర్మీ అధికారులు తెలియజేయలేదని బంధువులు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో గురువారం మృతి చెందినట్లు తెలియజేశారన్నారు.
1983లో జన్మించిన వెంకన్న.. 2000 సంవత్సరంలో ఆర్మీ జవాన్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక.. మరో ఐదేళ్లు పెంచుకున్నారు. ఇందులో మూడేళ్లు గడిచిపోయాయి. నందిపాడు గ్రామానికి చెందిన విజయతో ఆయనకు 2011లో వివాహమైంది. వారికి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు సంతానం. వెంకన్న తండ్రి జానయ్య గతేడాది సెప్టెంబరు 6న అనారోగ్యంతో మృతి చెందారు. కరోనా నిబంధనల నడుమ వెంకన్న.. తన తండ్రి కడచూపునకూ నోచుకోలేదు. తల్లి లక్ష్మమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెంకన్న మరణ వార్త ఆమెకు ఇంకా చెప్పలేదు. హైదరాబాద్‌లో ఉండే వెంకన్న అన్న సైదులు సమాచారం అందిన వెంటనే బయలుదేరి సాయంత్రం ఐదు గంటల సమయానికి పంజాబ్ చేరుకున్నారు.
ఇదీ చూడండి: సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకంజ