ETV Bharat / crime

'మా డాడీ ఆంధ్రాలో ఎంపీ.. అస్సలు ఫైన్ కట్టను' - ఉడిపి పోలీసులపై యువకుడి కామెంట్స్

రూ.3000 ఫైన్.. ఎవరిని అడుగుతున్నారు? ఇంతకీ నేనెవరో తెలుసా? మా నాన్న ఆంధ్రాలో ఎంపీ. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య నాకు తెలుసు. పిలిపించమంటారా? ఇక్కడికి'.. ఇవన్నీ డ్రంక్ డ్రైవ్​లో దొరికిన ఓ యువకుడు పోలీసులతో చెప్పిన మాటలు.

ap crime news
'మా డాడీ ఆంధ్రాలో ఎంపీ.. అస్సలు ఫైన్ కట్టను'
author img

By

Published : Feb 21, 2021, 8:41 AM IST

ఓ యువకుడు మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతడిని ఆపిన పోలీసులు.. జరిమానా కట్టాలంటూ.. అడిగారు. ఈ మాటలతో మత్తులో ఉన్న అతడు పోలీసుల పైకే లేచాడు. మా నాన్న ఎవరో తెలుసా అంటూ వాగ్వాదానికి దిగాడు. 'నేను ఆంధ్రప్రదేశ్​ ఎంపీ కుమారుడిని. నాకు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుసు. నేను ఎందుకు జరిమానా చెల్లించాలి.' అంటూ పోలీసులతో చెప్పాడు.

కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అనురాగ్ రెడ్డి మద్యం తాగి కారు నడుపుతున్నాడు. ఉడిపిలోని కల్సంకా జంక్షన్ వద్ద పోలీసులు అతడిని ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. 193 యూనిట్లు చూపించింది. పోలీసులు అతడికి రూ.3000 జరిమానా విధించారు. రూ.300 కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనని యువకుడు ట్రాఫిక్ పోలీసులతో చెప్పాడు. "మా డాడీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ, హోంశాఖ కార్యదర్శి నా తండ్రి స్నేహితుడు, నేను వారిని పిలుస్తాను'. అంటూ బెదిరింపులకు దిగాడు.

విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అనురాగ్ రెడ్డి కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ డ్రైవింగ్ కింద జరిమానా విధించారు. ఈ మేరకు ఉడిపి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

'మా డాడీ ఆంధ్రాలో ఎంపీ.. అస్సలు ఫైన్ కట్టను'

ఇవీచూడండి: 'ప్లాట్ ఫామ్' దొంగ అరెస్ట్​... 10 తులాల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.