యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. కొండయ్య, ఆరేతోటి సీతయ్య ఇద్దరూ కలిసి రాత్రి మద్యం సేవించారు.
అయితే డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన కొండయ్య సీతయ్యను రాడ్డుతో కొట్టడంతో అతడు చనిపోయాడు. మృతుడు ఏపీకి చెందిన వలస కూలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి: కరోనా రోగులతో డాక్టర్ల డ్యాన్స్.. వీడియో వైరల్