హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. మహారాష్ట్రలో ఒకే గ్రామానికి చెందిన సచిన్, నరేందర్‌లు... జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. సచిన్... ఫతేనగర్‌లోని ఎల్‌బీఎస్ నగర్‌లో నివాసముంటూ చెత్త కాగితాలు, సీసాలు సేకరించి జీవనం సాగిస్తున్నాడు.
నరేందర్ సైతం అదే ప్రాతంలో ఉంటున్నాడు. ఇద్దరు మిత్రులు కలిసి మంగళవారం మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో సచిన్‌ను... అతని మిత్రుడు నరేందర్ కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 1,24,907 మందికి కరోనా పరీక్షలు.. 1,175 కేసులు