స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ యువకుడిని హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పరిధిలోని రంగానగర్‌లో చోటు చేసుకుంది.
రంగానగర్‌కు చెందిన పర్వేజ్ (22).. కొంతకాలంగా సద్దాం హుస్సేన్ అనే వ్యక్తిని డబ్బుల కోసం వేధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సద్దాం హుస్సేన్.. అతని స్నేహితుడు మోట గౌస్‌తో కలిసి గత రాత్రి పర్వేజ్‌ను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన యువకుడు ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. గంజాయికి అలవాటు పడిన పర్వేజ్.. సంఘ విద్రోహ కలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.