ETV Bharat / crime

Murder in Kuwait: కువైట్‌లో హత్య... కడపలో వైరల్‌..!

Murder in Kuwait: ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కువైట్​లో ముగ్గురిని హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో అతనిని ఉరి తీయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. దీంతో జిల్లాలో కువైట్​ వెళ్లినవారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. అయితే కువైట్‌ రాయబార కార్యాలయం నుంచి గానీ, జిల్లా పోలీసుశాఖకు గానీ సమాచారం లేకపోవడంతో ఏ విషయాన్నీ ధ్రువీకరించలేకపోతున్నారు.

Murder in Kuwait
కువైట్​లో హత్య
author img

By

Published : Mar 9, 2022, 12:55 PM IST

Murder in kuwait: కువైట్‌లో వారం రోజుల కింద జరిగిన మూడు హత్యలు.. ఆంధ్రప్రదేశ్​లో కడప జిల్లాలోని రాయచోటి పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే హత్య కేసులో నిందితుడని గత మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అక్కడ ఓ సేఠ్‌ ఇంట్లో చోరీకి యత్నించి.. అడ్డొచ్చిన ఆయన కుటుంబాన్ని దారుణంగా హతమార్చాడని, గురువారం లేదా శుక్రవారం నిందితుడిని కువైట్‌ ప్రభుత్వం ఉరి తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో రాయచోటి పరిసర ప్రాంతానికి చెందిన దంపతులు కువైట్‌లో పని చేస్తున్నారు. వీరికి అప్పులు పెరిగిపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న ఆ భర్త.. తన భార్య పనిచేస్తున్న సేఠ్‌ ఇంట్లో ఈ నెల 6వ తేదీ చోరీకి యత్నించాడని, అడ్డొచ్చిన సేఠ్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ద్వారా తెలుస్తోంది. ఈ నెల 7న కువైట్‌ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారని, ప్రస్తుతం కువైట్‌ జైల్లో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి కువైట్‌ రాయబార కార్యాలయం నుంచి గానీ, జిల్లా పోలీసుశాఖకు గానీ సమాచారం లేకపోవడంతో ధ్రువీకరించలేకపోతున్నారు. నిందితుడికి సంబంధించిన చిరునామా గానీ, వివరాలు గానీ బయటకు రాలేదు. మరోపక్క జిల్లాలో కువైట్‌కు వెళ్లినవారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి: ఆ విషయంలో మందలించాడని తమ్ముడిని చంపించిన అక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.