ETV Bharat / crime

భగ్గుమన్న పాత కక్షలు.. యువకుడికి తీవ్ర గాయాలు - కత్తితో దాడి వార్తలు

నల్గొండ జిల్లా ఆమనగల్లు గ్రామంలో మెరుగు నవీన్ అనే యువకుడిపై కోల సుధాకర్ కత్తితో దాడి చేశాడు. నవీన్​ తలకు, చేతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న వేములపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

murder attempt, amanagallu, nalgonda district

author img

By

Published : May 13, 2021, 3:11 PM IST

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఈ నేపధ్యంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురికాగా ప్రాణాపాయం తప్పింది.

ఆమనగల్లు గ్రామానికి చెందిన మెరుగు నవీన్... అదే గ్రామానికి చెందిన కోల సుధాకర్ కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో నవీన్ కుటుంబం, కోల మల్లయ్యపై వేములపల్లి పోలీస్ స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, వేధింపుల కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

కోల మల్లయ్య కుమారుడు సుధాకర్... ఆమనగల్లు సెంటర్​లో నవీన్​పై కత్తితో దాడి చేయగా తలకు, చేతికి, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నవీన్​ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వేములపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: స్నేహితుడిని బంధించి యువతిపై సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.