ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తిమ్మినేనిపాలెంకు చెందిన రాయల వెంకటేశ్వర్లు(55) ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. కరోనాతో కాలేజీలు మూత పడటం వల్ల ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ... గార్ల మండల కేంద్రంలో ధనమ్మ అనే మహిళతో సహజీవనం చేసేవాడు. ధనమ్మ తమ్ముడు చాట్ల కోటేశ్, బంధువు సంపత్‌లు వెంకటేశ్వర్లతో ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలో టెబుల్ ఫ్యాన్ రాడ్‌తో వెంకటేశ్వర్ల తలపై మోదడంతో తీవ్ర గాయాలై... అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రవి ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధంపై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుందని స్థానికులు భావిస్తున్నారు.
- ఇదీ చూడండి : రూ.44.8 లక్షల బంగారం స్వాధీనం