ETV Bharat / crime

GANJA SMUGGLING IN AMAZON: 'అమెజాన్​' ద్వారా గంజాయి స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్ - ap 2021 news

ఏపీలోని విశాఖ కేంద్రంగా అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్(smugling marjuana thruough amazon) చేస్తున్న నలుగురు సభ్యులను మధ్యప్రదేశ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న శ్రీనివాస్​తో పాటు ఆన్​లైన్ స్టోర్​ ఉద్యోగులు కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు.

GANJA SMUGGLING IN AMAZON: 'అమెజాన్​' ద్వారా గంజాయి స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్

author img

By

Published : Nov 24, 2021, 2:22 PM IST

SMUGGLING MARJUANA THROUGH AMAZON: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్‌(smugling marjuana thruough amazon) జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు నగరానికి వచ్చి గంజాయిని సరఫరా చేసే శ్రీనివాస్‌ అనే వ్యక్తితో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిచ్చిన సమాచారం మేరకు విశాఖలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ నెల 13న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఓ దాబాలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా విశాఖ నుంచి అమెజాన్ యాప్‌ ద్వారా గంజాయి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయిని పికప్‌ చేసుకునే ముగ్గురిని మధ్యప్రదేశ్‌లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ కేసులో భాగంగానే విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ విశాఖ చేరుకున్నారు. వీరితో పాటు ఎస్ఈబీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

కరివేపాకు పొడి, హెర్బల్‌ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో గంజాయిని విశాఖ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేసి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు కొంత గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టేట్​లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

Fake job racket busted: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.