ETV Bharat / crime

నీటి సంపులో పడి తల్లి, కుమారుడి మృతి! - telangana news

నీటి సంపులో పడి తల్లి కుమారుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్​లో చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ప్రమాదవశాత్తు పడితే తల్లి తీయబోయి ఆమె కూడా మునిగిందా లేక మరేఇతర కారణాలైనా ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోలీసులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తల్లి, కుమారుడి మృతి
తల్లి, కుమారుడి మృతి
author img

By

Published : Jun 29, 2021, 9:27 AM IST

నీటి సంపులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్​లో జరిగింది. హన్మకొండకు చెందిన దొడ్డా రాజేంద్రప్రసాద్‌కు 2017లో సూర్యాపేటకు చెందిన శిరీష(30)తో వివాహం జరిగింది. వీరికి రెండున్నర ఏళ్ల కుమారుడు కార్తికేయ ఉన్నాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కావడంతో గత కొంతకాలంగా చందానగర్‌లో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం అమీన్‌పూర్‌ పట్టణంలోని సృజన లక్ష్మీ కాలనీకి నివాసం మార్చారు. ఆదివారం రాత్రి 9 గంటలకు కుమారుడు కార్తికేయ ఇంట్లో ఆడుకుంటూ బయటకు వెళ్లి నీటి సంపులో పడిపోయాడు. బాబు కనిపించకపోవడంతో భార్యభర్తలు బాబు కోసం వెతుకుతున్నారు.

రాజేంద్రప్రసాద్‌ బయటకు వెళ్లి వెతుకుతుండగా తల్లి శిరీష నీటి సంపులో పడిన బాబును కాపాడే క్రమంలో అందులో పడి మునిగిపోయారు. ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్‌కు భార్య కూడా కనిపించకపోవడంతో సంపులో చూడగా భార్య శిరీష, కుమారుడు కార్తికేయ మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు, శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.