ETV Bharat / crime

కూతురును రోకలి బండతో కొట్టి చంపిన తల్లి

సిద్దిపేట జిల్లా మల్లే చెరువు తండాలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల కుమార్తెను... మతిస్తిమితం సరిగ్గా లేని తల్లి భూక్య రాణి రోకలి బండతో కొట్టి చంపింది. దీంతో తండాలో విషాదం అలుముకుంది.

mother
రోకలి
author img

By

Published : Jul 7, 2021, 7:32 PM IST

నవమాససాలు మోసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. కంటిపాపల్లా కాపాడుకుంటూ ప్రేమగా పెంచుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ తల్లి మతిస్తిమితం కోల్పోయింది. తండ్రి డబ్బులు సంపాదించేందుకు వేేరే ఊరెళ్తుంటే... ఆ పిల్లలే దగ్గరుండి తల్లిని చూసుకుంటున్నారు. మతిస్తిమితం లేని ఆమే... తన బిడ్డను రోకలి బండతో కొట్టి చంపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో చోటుచేసుకుంది.

నాలుగైదు రోజులకోసారి...

మల్లేచెరువు తండాకు చెందిన భూక్య తిరుపతి, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టే వరకూ బాగానే ఉన్న రాణి... నాలుగేళ్ల క్రితం మతిస్తిమితం కోల్పోయింది. అప్పటి నుంచి పిల్లలే ఆ తల్లిని చూసుకుంటున్నారు. భర్త తిరుపతి కరీంనగర్​లో కూలిపని చేసుకుంటూ... నాలుగైదు రోజులకోసారి ఇంటికి వస్తుంటాడు. కావాల్సిన సరుకులన్నీ కొనిచ్చి మళ్లీ వెళ్తుంటాడు. వారి తొమ్మిదేళ్ల పెద్ద కూతురు లావణ్యే.. అమ్మతోపాటు తమ్ముడిని, చెల్లిని చూసుకుంటుంది.

రోకలి బండతో కొట్టి హత్య..

రాణి మతిస్తిమితం కోల్పోయినప్పటికీ... ఇప్పటి వరకూ ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు. కానీ ఈ రోజు ఉదయం తన పెద్ద కూతురు లావణ్య తలపై రోకలి బండతో బాదింది. తీవ్ర గాయాలపాలైన లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. విషయం గుర్తించిన మిగతా ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో... ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చారు. ఏమైందంటూ ప్రశ్నిస్తుంటే... ఏం చెప్పలేని ఆ పిల్లలు ఇంట్లో ఉన్న తల్లిని, రక్తపుమడుగులో పడి ఉన్న అక్కను చూపించారు. స్థానికులు దగ్గరకు వెళ్లి చూసేసరికి లావణ్య చనిపోయి ఉంది. వెంటనే భర్త తిరుపతికి, పోలీసులకు సమాచారం అందించారు.

బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పిల్లలు

హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు తల్లి రాణిని అదుపులోకి తీసుకున్నారు. కుమార్తె లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతిస్తిమితం లేని తల్లే... తమ అక్కను చంపడం జీర్ణించుకోలేని పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నారు. ఓ వైపు రక్తపు మడుగులో ఉన్న అక్క, రోకలి బండ పట్టుకొని ఉన్న కన్నతల్లిని చూసి తీవ్రంగా భయపడిపోయారు. పట్టరాని దుఃఖం, భయం మధ్యలో ఏం చేయాలో పాలుపోక దీనంగా ఇంటికొచ్చిన వారి మొహాలు చూస్తున్నారు.

ఇదీ చూడండి: MAOIST: ఎట్లున్నవ్‌ కొడుకా.. ఎక్కడున్నవ్‌ నాన్నా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.