Mother Suicide with her Children: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి రాజ బొల్లారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాల కారణంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి గ్రామ చెరువులో దూకింది. ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పెద్ద కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ బొల్లారం గ్రామానికి చెందిన బిక్షపతికి భార్య మమత(32), ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా తరచూ భార్యాభర్తల మధ్య చెలరేగుతున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన మమత, తన ముగ్గురు పిల్లలను తీసుకుని చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటనలో మమతతో పాటు ఒక బాబు(1), ఒక పాప(3) మృతి చెందగా మరొక బాబు క్షేమంగా బయట పడ్డాడు. స్దానికుల సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డల మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు..! ఆగంతకుడి ఫోన్‌కాల్