పాపను పోషించడం తనతో కాదంటూ ఓ తల్లి తన బిడ్డను పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన(Mother Handed the Child) ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా దండె పల్లికి చెందిన కస్తూరి మహేశ్వరి అనే మహిళా తన ఏడాదిన్నర వయసున్న బిడ్డను పోలీసులకు అప్పగించింది. ఆమె తీవ్ర అస్వస్థతతో ఉండగా ఆమె వద్ద నుంచి వివరాలు సేకరించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శిశు సంక్షేమ అధికారులకు సమాచారం అందించడంతో చిన్నారిని సఖీ కేంద్రానికి తరలించారు.
అనారోగ్యమే కారణం...
భర్త వేధింపులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య కారణంతో బిడ్డను పోషించలేక ఈ పని చేశానని మహేశ్వరి తెలిపింది. తీవ్ర జ్వరంతో ఉన్న మహేశ్వరికి జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాల చికిత్స అందిస్తున్నారు. ఘటనకు కారణాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: Lover Revenge: ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్.. అందులో ఏం ఉందంటే?