ఖమ్మం నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. మున్నేరు నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకొంది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. నది నుంచి బయటకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే వారు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. మృతులు రేవతి సెంటర్‌కు చెందిన ధోన్వాన్ వనిత, ఆమె పిల్లలు చైతన్య, రోహితలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నం సేవా సంస్థ సభ్యులు మృతదేహాలను మార్చురీకి తరలించారు.
తమకు ఆర్థిక సమస్యలు ఏం లేవని.. బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ బంధువులకు అధిక వడ్డీలకు పెద్ద మొత్తంలో వనిత అప్పు ఇప్పించిందన్నారు. తీసుకున్నవారు సరిగా వడ్డీలు చెల్లించకపోవడం వల్ల.. అప్పు ఇచ్చిన వారు వనితపై ఒత్తడి తెచ్చారన్నారు. ఫలితంగానే ఆమె మరణించి ఉంటుందని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
![mother suicide with her two children at khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12071415_kmm22.jpg)
ఇవీచూడండి: రైల్వే కోచ్‌లో అగ్ని ప్రమాదం- భారీగా మంటలు