ETV Bharat / crime

ACCIDIENT: డివైడర్​ని ఢీకొట్టిన కారు... తల్లి, కుమారుడు మృతి.. - accidient at munagala mandal

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందారు. రహదారిపై నీరు చేరడంతో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి డివైడర్​ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య, కూతురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్ట్ అయ్యాయి.

Mother and son killed in road accident in Suryapeta district
ACCIDIENT: డివైడర్ను ఢీకొట్టిన కారు... తల్లికుమారుడు ఇద్దరు మృతి..
author img

By

Published : Jun 27, 2021, 10:48 PM IST

జోరువాన కారణంగా కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కుమారుడు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది ఈ ప్రమాదం. విజయవాడకి చెందిన దొడ్డపనేని శివరాం కుటుంబ సభ్యులతో హైదరాబాద్​లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మునగాల వద్దకు వచ్చే సరికి భారీ వర్షం పడుతుంది.

భారీ వర్షానికి మునగాల జాతీయ రహదారిపై నీరు చేరడంతో.. కారు అదుపుతప్పి డివైడర్​ను బలంగా ఢీకొట్టింది. తల్లి స్వరాజ్యలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు శివరాం మృతి చెందాడు. శివరాం భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శివరాం మైలవరం ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ACCIDIENT: డివైడర్ను ఢీకొట్టిన కారు... తల్లికుమారుడు ఇద్దరు మృతి..

ఇదీ చూడండి: Dalit Empowerment: బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ఎస్సీలకు రుణాలు, ఆర్థికసాయం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.