యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలికలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న భాస్కరాచారీ వారం రోజుల క్రితం తన కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి గేటుకు తాళం వేసే ఉందని, ఇంటి మెయిన్ డోర్‌కు వేసిన తాళం పగులగొట్టి ఉందని తెలిపారు.
లోపలికి వెళ్లి చూడగా.. పడక గదిలో ఉన్న బీరువా తెరిచి ఉందని, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని భాస్కరాచారీ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.
![money and gold theft at mothkur in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-61-01-chory-av-ts10101_01032021074120_0103f_1614564680_592.jpg)
ఘటానా స్థలికి చేరుకున్న పోలీసులు వేలి ముద్రలు సేకరించారు. రూ.50వేలు, 2 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీకి గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
- ఇదీ చూడండి : అటవీప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు