ETV Bharat / crime

MLA Aroori Ramesh Help : మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

author img

By

Published : Jan 1, 2022, 12:06 PM IST

MLA Aroori Ramesh Help : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మానవత్వం చాటుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ ఘటన పర్వతగిరి మండల కేంద్రం సమీపంలో జరిగింది.

MLA Aroori Ramesh Help , PARVATHAGIRI ACCIDENT
మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

MLA Aroori Ramesh Help : వరంగల్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అటు వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సుకు ఫోన్ చేసి... బాధితులను ఆస్పత్రికి తరలించారు.

అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం ఆస్పత్రి సూపరిటెండెంట్​తో ఫోన్​లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.

మృతుడు చింతనెక్కొండ గ్రామానికి చెందిన తాళ్ల ప్రవీణ్​గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నలుగురు బాలురు ప్రయాణించినట్లు తెలిపిన పోలీసులు... వీరు పర్వతగిరిలోని ఆదర్శపాఠశాలలో చదివే ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు.

ఇదీ చదవండి: old woman story : ఆ అవ్వకు అయినవారికంటే.. అక్షరాలే నేస్తాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.