ETV Bharat / crime

నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్​.. గాలింపు ముమ్మరం - minor girl kidnap in amrabad

నాగర్​కర్నూల్​ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి గుర్తు తెలియని బాలిక కిడ్నాప్​కు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు అమ్రాబాద్​ పోలీసులు రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చర్యలు ముమ్మరం చేశారు.

girl kidnap in nallamala
నల్లమలలో బాలిక కిడ్నాప్​
author img

By

Published : Aug 4, 2021, 2:21 PM IST

నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. రెండో రోజు ఉదయం నుంచే అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నాగర్​ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ శివారులోని పురులగుట్ట వద్ద.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. మన్ననూర్​కు చెందిన ఓ బాలికను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో చిన్నారి బిగ్గరగా కేకలు వేసింది. ఓ మహిళ ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పింది. స్థానికులు అమ్రాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు.

girl kidnap in nallamala
బాలిక కోసం గాలిస్తున్న పోలీసులు

సీఐ బీసన్న సిబ్బందితో కలిసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ నరసింహులు, ఇతర పోలీసు సిబ్బంది కిడ్నాప్​పై ఆరా తీస్తున్నారు. ఇంతవరకూ బాలిక ఆచూకీ తెలియలేదు.

ఇదీ చదవండి: GHMC: 'మ్యాన్​హోల్​లోకి దిగిన ఇద్దరూ మా సిబ్బంది కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.