ETV Bharat / crime

పెళ్లి చేసుకుంటానని పంజాబ్​ తీసుకెళ్లి.. - minor boy trapped

ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తనతో వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక లైంగికంగా వేధించసాగాడు. అసలు విషమేమిటంటే... ఇద్దరూ మైనర్లే. తమ కూతురు కన్పించట్లేదని తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టిన హైదరాబాద్​ పోలీసులకు పంజాబ్​లో చిక్కుముడి వీడింది.

minor boy trapped minor girl in kushaiguda

author img

By

Published : Apr 27, 2021, 10:34 PM IST

ప్రేమ పేరుతో ఓ​ బాలికను వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన​ బాలున్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. పంజాబ్​ రాష్ట్రానికి చెందిన సోనుకుమార్​ ఠాకూర్​ అనే మైనర్​... బతుకుదెరువు కోసం హైదరాబాద్​ వచ్చాడు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పాడు. ఆ అమ్మాయి కూడా సోను మాటలు నమ్మి... అతడి మాయలో పడింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సోనుకుమార్​​... బాలికను మూడు రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కూతురు కనిపించటం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. చరవాణి సిగ్నల్స్​ ఆధారంగా బాలిక పంజాబ్​లో సోనుకుమార్​తో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ హైదరాబాద్​ తీసుకొచ్చారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను తీసుకెళ్లాడని... అక్కడికి వెళ్లిన తర్వాత లైంగికంగా వేధించాడని... విచారణలో బాలిక వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరూ మైనర్లే కావటం గమనార్హం. సోనుకుమార్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: కరోనాతో భర్త మృతి... తనకూ సోకిందని భార్య ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.