ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మతిస్థిమితం సరిగాలేని యువతిపై.. వెంకటేష్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన సమాచారాన్ని స్థానిక తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు.. కుప్పంలోని పార్టీ కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు. బాధితురాలికి, కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవాలని ఆదేశించినట్లు స్థానిక నాయకులు తెలిపారు. కాగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అధికార పార్టీ మద్దతుదారుగా ప్రచారం సాగుతోంది.