ట్రాక్టరు టైరుకు గాలి కొడుతుండగా ప్రమాదవశాత్తు ట్యూబ్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
జాలుమూరుకు చెందిన దాసరి సూర్యనారాయణ పంక్చర్ షాపునకు.. స్థానికుడు గోవింద ట్రాక్టరు టైరును రిపైర్ కోసం తీసుకువచ్చాడు. పని పూర్తి చేసి గాలి కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అది పేలింది. ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, తీవ్ర గాయాల పాలైన గోవిందను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
ఇదీ చదవండి: తెదేపాకు షాక్.. వైకాపాలో చేరిన నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులు